కమల్ హాసన్కాం(Kamal Haasan) – శంకర్ (Shankar) బినేషన్లో రూపొందిన ‘ఇండియన్’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. 1996 లో వచ్చిన ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. ప్రభుత్వ ఆఫీసుల్లో జరిగే అన్యాయాన్ని.. వృద్ధ వయసులో ఉన్న సేనాపతి ఎలా ఎదురించాడు? ఎదురుతిరిగిన వాళ్ళతో ఎలా యుద్ధం చేశాడు అనే పాయింట్ తో ‘ఇండియన్’ సినిమా రూపొందింది. అది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కానీ 28 ఏళ్ళ తర్వాత దానికి సీక్వెల్ గా ‘ఇండియన్ 2’ (Indian 2) వచ్చింది.
Shankar
వాస్తవానికి ఇది కూడా మంచి సబ్జెక్టే..! ‘ఇప్పటి జనరేషన్లో ప్రతి ఒక్క ఇంట్లో లంచగొండి ఉన్నారు. ఎవ్వరూ సిన్సియర్ గా లేదు. ముందు మీ ఇంట్లో ఉన్న కరెప్షన్ ని అంతం చేసి తర్వాత సొసైటీలో ఉన్న అన్యాయాన్ని ఎదురించండి’ అనే పాయింట్ ‘ఇండియన్ 2’ రూపొందింది. కానీ ఇంత మంచి కాన్సెప్ట్ కి తగ్గ స్క్రీన్ ప్లే లేదు. ‘ఇండియన్’ కి సుజాత రంగరాజన్ రైటింగ్ బాగా ప్లస్ అయ్యింది. చెప్పాలంటే శంకర్ (Shankar) సినిమాలకి అతని రైటింగ్ మేజర్ ప్లస్ పాయింట్.
అతను లేకపోవడంతో ‘ఇండియన్ 2’ చాలా వీక్ గా కనిపించింది. అయితే ‘ఇండియన్ 3’ కూడా ఉంటుంది. ‘ఇండియన్ 2’ కంటే ‘ఇండియన్ 3’ బాగుంటుంది అంటూ శంకర్ హోప్స్ ఇచ్చాడు. కానీ ‘ఇండియన్ 2’ రిజల్ట్ ను బట్టి ‘ఇండియన్ 3’ కి మంచి బిజినెస్ జరుగుతుంది అని ఆశించలేం. అందుకే ఈ సినిమాని నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు.
కానీ ఇండియన్ 2 డిజిటల్ హక్కులు భారీ రేటుకి కొనుగోలు చేసి.. సరైన వ్యూయర్షిప్ రాక, ఆ సంస్థ భారీగా నష్టపోయింది. కాబట్టి.. ‘ఇండియన్ 3’ హక్కులను కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. అందుకే శంకర్ కూడా ‘ఇండియన్ 3’ ని నేరుగా ఓటీటీలో విడుదల చేయడం లేదు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ‘ఇండియన్ 3’ ని థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నా బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించరు. సో ఆ ఆలోచన కూడా రిస్క్ అనే చెప్పాలి.