టీడీపీ యువనేత నారా లోకేష్ హీరో అవ్వాలనుకొని రాజకీయ నాయకుడు అయ్యారా? తాజాగా బయటికి వచ్చిన న్యూస్ ని గమనిస్తే ఇది నిజం అనిపిస్తుంది. 2002లో అంటే 18ఏళ్ల క్రితం నారా లోకేష్ వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యిందట. యూత్ ఫుల్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్న దర్శకుడు తేజ, లోకేష్ ని లాంఛ్ చేసే బాధ్యత తీసుకున్నారట. లోకేష్ హీరోగా ఓ రొమాంటిక్ లవ్ డ్రామా తెరకెక్కించాలని అనుకున్నారట.
నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ని తన రాజకీయ వారసుడిగా అనుకోవడం హీరో అవ్వడానికి ఒప్పుకోక పోవడం వలనో,మరే ఇతర కారణం కావచ్చు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. మరి ఇన్నేళ్ల తరువాత ఈ ప్రస్తావన ఎలా వచ్చిందంటే…సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి ట్వీట్ వలన. 2002లో విడుదలైన సంతోషం సినీ మ్యాగజైన్ కవర్ పేజీని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ మ్యాగజైన్ పై చిరంజీవి ఫోటో ఉండగా, బ్యాక్ గ్రౌండ్ లో నారా లోకేష్, తేజా మూవీకి సంబంధించిన ప్రకటన ఉంది.
అది చూసిన నెటిజెన్స్, అంటే అప్పట్లో నారా లోకేష్ హీరో అవ్వాలనుకున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు డై హార్డ్ ఫ్యాన్స్ మరియు టీడీపీ అభిమానులు నారా లోకేష్ హీరో అయ్యుంటే ఎన్టీఆర్ ని కూడా మించి పోయేవాడని, పరిశ్రమలో తిరుగులేని స్టార్ గా ఎదిగేవారని కామెంట్స్ చేస్తున్నారు. అన్నీ కుదిరి అప్పుడు నారా లోకేష్ హీరో అయితే ఇప్పటి టాలీవుడ్ సమీకరణాలు ఎలా ఉండేవో.