మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి అని చెప్పాలి. రెండో రోజు కూడా నైజాం, నార్త్ వంటి ఏరియాల్లో పర్వాలేదు అనిపించింది.
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ సినిమాకి రూ.66.38 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.183.62 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.