రాంచరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన మూవీ ‘గేమ్ ఛేంజర్’(Game Changer) . ఈ సినిమా థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దిల్ రాజు (Dil Raju) రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా లార్జ్ స్కేల్లో ఉన్నా.. కంటెంట్ ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించకపోవడం వల్ల మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించినా.. తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj) ల సినిమాల పోటీని తట్టుకుని నిలబడలేకపోయింది.
Game Changer Collections:
రెండో వారం ఈ సినిమా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. ‘గేమ్ ఛేంజర్’ 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే:
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 14 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు రూ.102.5 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.152.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.