“జెర్సీ” లాంటి మోస్ట్ మెమరబుల్ హిట్ అనంతరం నాని కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్ లీడర్”. “ఇష్క్, మనం 24” చిత్రాల ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రివెంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. నాని సరసన ప్రియాంక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో “ఆర్ ఎక్స్ 100” కార్తికేయ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
రైటర్ పెన్సిల్ పార్ధసారధి ఒక అయిదుగురు ఆడవాళ్ళ పగను తీర్చడం కోసం పడిన పాట్లు, ఎదుర్కొన్న ఇబ్బందుల కథ ఈ గ్యాంగ్ లీడర్ అని చాలా స్పష్టంగా టీజర్ తోన్ చెప్పేసాడు దర్శకుడు విక్రమ్ కుమార్. కార్తికేయ కార్ రేసర్ గా కనిపించాడు. “ఓ బేబీ”లో బామ్మగా సెంటిమెంట్ పండించిన లక్ష్మీ ఈ చిత్రంలో కామెడీతో రచ్చ చేసేట్లుగా ఉంది. కథ చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ.. విక్రమ్ కుమార్ మార్క్ ట్విస్టులు, మ్యాజికల్ స్క్రీన్ ప్లే తోడవుతుంది కాబట్టి “గ్యాంగ్ లీడర్” ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం ఖాయం.