ఈమధ్యకాలంలో దర్శకులు, కథానాయకులు తాము నటించే లేదా దర్శకత్వం వహించే సినిమాల్లో నిర్మాణ భాగస్వామ్యం తీసుకోవడం లేదా కొన్ని ఏరియాల రైట్స్ తీసుకోవడం అనేది సర్వసాధారణం. అప్పట్లో చిరంజీవి తాను నటించే సినిమాల నైజాం రైట్స్ ను కొనుక్కొనేవాడట. అదే తరహాలో ఇప్పుడు హరీష్ శంకర్ కూడా తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “వాల్మికి” రైట్స్ తీసుకొన్నాడట. “దువ్వాడ జగన్నాధం” తర్వాత కొన్నాళ్ళ విరామం అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది.
వరుణ్ తేజ్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. తమిళ నటుడు అధర్వ మురళి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా హూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఇటీవలే సినిమా అవుట్ పుట్ చూసిన హరీష్ శంకర్ సినిమా రిజల్ట్ మీద పిచ్చ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. అందుకే.. “వాల్మికి” సినిమా కొన్ని ఏరియా రైట్స్ తీసుకొని నిర్మాణంలో పార్ట్నర్ గా మారాడు. అప్పట్లో “గబ్బర్ సింగ్”కి కూడా ఇదే కాన్ఫిడెన్స్ తో వైజాగ్ రైట్స్ కొన్నాడట హరీష్ శంకర్. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత “వాల్మికి” విషయంలో ఆ పద్ధతిని ఫాలో అవుతుండడంతో.. హరీష్ శంకర్ కెరీర్ కి “వాల్మికి” మరో “గబ్బర్ సింగ్” అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకొంటున్నాయి. చూద్దాం.. సెప్టెంబర్ 20న అసలేం జరుగుతుందో.