ధనుష్.. ‘సార్’ మూవీ ఫంక్షన్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్.. తమిళంలో శివాజీ గణేశన్, కమల్ హాసన్ లాంటి గొప్పనటుల తర్వాత జనరేషన్‌లో అలాంటి గొప్పనటుల్లో నేను ధనుష్‌కి టాప్ ప్లేస్ ఒకటిస్తాను’’ అని అన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ‘సార్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా కానీ అంతకుముందే పలు డబ్బింగ్ సినిమాలతో మన ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే.. ముఖ్యంగా ‘రఘువరన్ బి.టెక్’ తో తెలుగు యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు ధనుష్..
తమిళనాట విలక్షణ నటుడే కాకుండా.. యాక్టర్‌గా రెండు, ప్రొడ్యూసర్‌గా రెండు నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు.. రైటర్, సింగర్‌గానూ సత్తా చాటారు.. హిందీతో పాటు అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్.. ‘ది గ్రే మెన్’ లోనూ నటించారు.. సినిమా సినిమాకీ కథ, క్యారెక్టర్ పరంగా వైవిధ్యం చూపిస్తూ.. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని, అభిమానులనీ సంపాదించుకున్నారు ధనుష్..
తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి’ గా రిలీజ్ చేయగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.. ముఖ్యంగా ధనుష్ వన్ మెన్ షో అనేలా లెక్చరర్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారంటూ ప్రశంసిస్తున్నారు.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్ల మీద నాగవంశీ – లక్ష్మీ సౌజన్య నిర్మించారు.. ప్రీమియర్స్‌కే భారీ డిమాండ్ నెలకొంది.. పాజిటివ్ రావడంతో రిలీజ్ రోజు మార్నింగ్ షోకి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వచ్చాయి..
ఫిబ్రవరి 17 మధ్యాహ్నం సక్సెస్ ప్రెస్ మీట్‌లో ప్రొడ్యూసర్ నాగవంశీ.. తెలుగులో ఫస్ట్ రోజునే ‘రఘువరన్ బి.టెక్’ ఫుల్ రన్ కలెక్షన్లను దాటేస్తుందని చెప్పారంటే తెలుగు నాట ధనుష్ క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది.. ఆ సినిమా రూ. 4.5 కోట్లు షేర్ రాబట్టింది.. ఇక ‘సార్’ మూవీ కోసం ధనుష్ కాస్ట్యూమ్స్‌కి కూడా కేవలం రూ. 7 – 8 లక్షలు మాత్రమే ఖర్చు చేశారట.. అయితే ఇటీవల ‘వాతి’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కి ధనుష్ వేసుకొచ్చిన డ్రెస్ గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
1) ZEGNA – Vicuna Color Oasi Cashmere Crewneck Sweater and Overshirt – కాస్ట్ – రూ. 2,30,896/- (Overshirt).. 1,06,758/- (Sweater)..