ప్రభాస్ (Prabhas) , హోంబలే ఫిల్మ్స్ కాంబినేషన్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సలార్ (Salaar) సినిమాతో ఈ కాంబినేషన్ భారీ అంచనాలను పెంచింది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ 2 కూడా రానుంది. ఇక అది సేత పై ఉండగా, మరోసారి హోంబలే ప్రభాస్‌తో సరికొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోంది. లేటెస్ట్ గా, ప్రభాస్ కోసం హోంబలే ఫిల్మ్స్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను (Lokesh Kangaraj) ఎంపిక చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం.
Prabhas
ప్రస్తుతం రజనీకాంత్‌తో (Rajinikanth) కూలీ (C0olie) ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న లోకేష్, ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ప్రభాస్‌తో భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. విక్రమ్ (Vikram) , ఖైదీ (Kaithi), లియో (LEO) వంటి సినిమాలతో తన డైరెక్షన్ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించిన లోకేష్, ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు సరిపోయే సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని టాక్. ఇక ప్రశాంత్ నీల్‌తో సలార్ 2 అనంతరం మరొక ప్రాజెక్ట్ ను చేయబోతుండగా, మరిన్ని ప్రాజెక్టులకు హోంబలే ప్లాన్ చేస్తోంది.
ఇక అందులో లోకేష్ పేరు ఖరారవుతున్నట్లు సమాచారం. ఇక ఈ లీక్ తో కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్‌ను సెట్ చేసుకున్నాడు. లోకేష్ లాంటి కంటెంట్ మాస్టర్ (Master) దర్శకత్వంలో సినిమా అంటే ప్రేక్షకులకు పండగే. ఇక ప్రభాస్ లైనప్ లో మరోవైపు క్రేజీ సినిమాలున్నాయి. కల్కి (Kalki 2898 AD) సెకండ్ పార్ట్ తో పాటు మరోవైపు హాను రాఘవపూడితో (Hanu Raghavapudi) ఫౌజీ ప్రాజెక్ట్, మారుతితో (Maruthi Dasari) రాజా సాబ్ (The Rajasaab) సినిమాలు లైన్‌లో ఉన్నాయి.
ఈ అన్ని ప్రాజెక్టుల మధ్య హోంబలేతో చేయబోయే ప్రాజెక్ట్ ఒక ప్రత్యేకమైన స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. ఇక లోకేష్ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ కాంబినేషన్ ప్రభాస్ క్రేజ్‌ను మరింత పెంచి, తెలుగు సినిమా ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ప్రాజెక్ట్ వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.