బాహుబలి సినిమాతో దగ్గుబాటి రానా క్రేజ్ పెరిగిపోయింది. అతని సినిమాలకు హిందీ భాషలోనూ గిరాకీ ఏర్పడింది. అతను హీరోగా చేసిన ఘాజీ మూవీ హిందీలోనూ మంచి కలక్షన్స్ రాబట్టింది. దీంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు రానా సినిమాను కొనుగోలు చేయడానికి క్యూ కట్టారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాతో రానా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ అంచనాలను పెంచింది. దీంతో నేనే రాజు నేనే మంత్రి సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తం చెల్లించి ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా రైట్స్ కోసం ఆ సంస్థ ఏకంగా 11 కోట్లకు చెల్లించినట్లు తెలిసింది.
గత శుక్రవారం రిలీజ్ అయిన అల్లు అర్జున్ డీజే మూవీ హిందీ హక్కులు 8 కోట్లు మాత్రమే పలికాయి. ఆ చిత్రం కంటే రానా మూవీ మూడు కోట్లు ఎక్కువగా పలకడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా అశితోష్ రాణా, కేథరిన్ థెరిస్సా, నవదీప్, పోసాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ వచ్చే నెల థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.