మంచి సినిమా అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ.. ఆ మంచి సినిమాను ఆదరించే ప్రేక్షకులు కరువయ్యారు అనేది ఎవరు ఒప్పుకున్నా.. కోకపోయినా అది నిజం. ప్రవీణ్ సత్తారు లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ కూడా తాను తీసిన చందమామ కథలు అనే నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు అన్న కోపంతోనే “గుంటూర్ టాకీస్” అనే బీగ్రేడ్ కంటెంట్ ఉన్న సినిమా తీసి బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాడు. ఇప్పుడు అతడి బాటలోనే మరో కంటెంట్ ఉన్న డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా ప్రయాణించాలనుకుంటున్నాడు.
“అమీ తుమీ, సమ్మోహనం” లాంటి డీసెంట్ హిట్స్ తర్వాత ప్రస్తుతం నాని-దుల్కర్ సల్మాన్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న ఇంద్రగంటికి తనను అందరూ “పాపం డీసెంట్ సినిమాలు తీస్తాడండి” అని అంటుండడం చాలా ఇబ్బందిగా ఉంటుందట. అలాగే.. ఇండీసెంట్ సినిమాలు తీసే దర్శకులు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు అని ఇంద్రగంటి పేర్కొనడం విశేషం. ఇంద్రగంటి డబ్బుకు లోంగే మనిషి కాదు, పైగా ఆధునిక భావాలతోపాటు ప్రొఫెషనల్ ఎథిక్స్ & మోరల్ వేల్యుస్ ఉన్న మనిషి. సో, ఆయన డబ్బు కోసం చెత్త సినిమాలు చేయడు అనే నమ్ముతున్నారు ప్రేక్షకులు. అయినా ఆయనకి అలా అనిపించడంలో తప్పు లేదు లెండి. “సమ్మోహనం” సినిమా బాగుంది అని అందరూ అన్నప్పటికీ సినిమాకి లాభాలు మాత్రం రాలేదు. ఏదో బ్రేకీవెన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.