ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని ప్రకటించేశాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. మే నెల నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీయడంలో దిట్టైన త్రివిక్రమ్ ఎన్టీఆర్ కొరకు కూడా అలాంటి స్క్రిప్ట్ ఒకటి సిద్ధం చేశారని సమాచారం. ఐతే ఎన్టీఆర్ త్రివిక్రమ్ ని ఎంచుకోవడానికి కూడా అసలు కారణం, అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ కావడం.
ఐతే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ ని కాకుండా అట్లీ లేదా ప్రశాంత్ నీల్ ని ఎంచుకోవలసింది. ఎందుకనగా అట్లీ లేదా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చిత్రం చేసినట్లైతే ఆయనకు ఖచ్చితంగా ఇతర పరిశ్రమల నుండి మంచి గుర్తింపు దక్కేది. అట్లీ తమిళంలో, ప్రశాంత్ నీల్ కన్నడ మరియు ఇతర పరిశ్రమలలో టాప్ డైరెక్టర్స్ గా ఉన్నారు. వీరి డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే స్థానిక పరిశ్రమలలో ఆ సినిమా పై విపరీతమైన చర్చ నడుస్తుంది. ఆ కారణంగా ఇరత పరిశ్రమలపై పట్టు సాధించినట్లు అవుతుంది. ఇక టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరిగా ఉన్న త్రివిక్రమ్ గురించి ఇతర చిత్ర పరిశ్రమలో తెలిసింది చాలా తక్కువ. దాని కారణంగా ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీపై బజ్ కేవలం టాలీవుడ్ కే పరిమితం. అలా కాకుండా ఎన్టీఆర్ అట్లీ లేదా ప్రశాంత్ నీల్ తో చేసి ఉంటే తమిళ మరియు కన్నడ పరిశ్రమలలో కూడా ఈ చిత్రం పై చర్చ నడిచేది.