యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్కూల్ కి వెళ్లే వయసులోనే తాత నందమూరి తారకరామారావు సినిమాలన్నీ చూడడమే కాదు అందులోని పద్యాలు కంఠస్థం చేశారు. అంతేకాదు మహా భారతం, రామాయణం, మన పూర్వీకుల చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయం గురించి అతనికి తెలిసినంతగా, నేటి హీరోలకు తెలియదు. ఆ సంగతి మరో మారు రుజువు అయింది. గత శనివారం హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ తనయులు కుమారులు తారకరామారావు(13), సౌమిత్ర ప్రభాకర్(11)ల పంచెకట్టు వేడుక..
తూర్పుగోదావరి జిల్లా, కరప మండలం, వేళంగిలో ఉంటున్న తాత యార్లగడ్డ ప్రభాకరరావు ఇంట్లో జరిగింది. ఈ వేడుకకు హరికృష్ణ తో పాటు కళ్యాణ్ రామ్, తారక్ ఇద్దరూ వెళ్లారు. వేడుకకు వచ్చిన బంధు మిత్రులతో సరదాగా మాట్లాడారు. ఆ సమయంలో యంగ్ టైగర్ పంచెకట్టు సంప్రదాయం గురించి ఎవరో అడగగా ఆయన ఓపిగ్గా వివరించారంట. పెద్దలు మరిచిపోయిన అనేక విషయాలపై ఓ క్లాస్ తీసుకున్నారంట. అప్పుడు ఎన్టీఆర్ పక్కనే ఉన్న కళ్యాణ్ రామ్ తమ్ముడి తెలివితేటలను ఎలా అభినందించాలో తెలియక రెండు చేతులు జోడించి “నీకో దండం రా బాబు.. నీతో మాట్లాడడం అంత ఈజీ కాదు’’ అని అనేసరికి అక్కడ నవ్వులు పువ్వులు విరిశాయి. ఆ అపురూప సందర్భాన్ని కెమెరా మెన్ బంధించి అందరికీ తెలిసేలా చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.