నందమూరి కళ్యాణ్ రామ్ హీరో మాత్రమే కాదు. నిర్మాత కూడా. అందుకే అతనికి నిర్మాతలకు ఉండే ఇబ్బందులు తెలుసు. కష్టాలు తెలుసు. ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ అయితే ఎంత నష్టమవుతుందో కూడా అవగాహన ఉంది. అందుకే తాను గాయాలపాలు అయినప్పటికీ.. సెట్స్ కి వచ్చి పెయిన్ కిల్లర్స్ వేసుకొని నటించారు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణ్ రామ్ రీసెంట్ గా జై లవకుశ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత హీరోగా ఎంఎల్ఏ అనే చిత్రాన్ని పూర్తి చేశారు. నూతన దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వంలో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. కళ్యాణ్ రామ్ గ్యాప్ తీసుకోకుండా మరో చిత్రాన్ని మొదలెట్టారు.
జయేంద్ర దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ వికారాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో కళ్యాణ్ రామ్ కి దెబ్బలు తగిలాయి. అయినా నెస్ట్ రోజు షూటింగ్ వచ్చినట్లు చిత్ర నిర్మాత మహేష్ ఎస్ కోనేరు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. “కళ్యాణ్ రామ్ గాయపడ్డప్పటికి, షూటింగ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకొని సెట్‌కి వచ్చారు. కళ్యాణ్ రామ్ డెడికేషన్‌కి హ్యట్సాఫ్” అని పోస్ట్ పెట్టారు. చిత్ర బృందం, అభిమానులు కళ్యాణ్ రామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.