‘ఆట అయినా.. రికార్డ్ ల వేట అయినా…, పోటి అయినా.. కలక్షన్స్ భేటీ అయినా.., ఆయన దిగనంతవరకే అన్నయ్య దిగాక అందరూ ఇంక తమ్ముళ్లే’.. మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ అభిమాని స్పందన ఇది. చిరు పదేళ్ల తర్వాత నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ వందకోట్లు షేర్ వసూల్ చేసిందని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ పై మాటను అంగీకరిస్తారు. సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజ్ అయిన మెగాస్టార్ 150 వ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది. మాస్ డైరక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 17 రోజులకు వంద కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి మెగా పవర్ చూపించింది.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపివేసింది. అత్యధిక షేర్ వసూలు చేసిన రెండో తెలుగు చిత్రం గా బాస్ మూవీ నిలిచింది. 311 కోట్ల షేర్ కలక్షన్స్ తో బాహుబలి మొదటి స్థానంలో ఉంది. 85 కోట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్న మహేష్ బాబు శ్రీమంతుడు మూవీని వెనక్కి నెట్టి ఖైదీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అందుకే మెగా ఫ్యాన్స్ తో పాటు, సినీ పండితులు సైతం చిరంజీవి చిరంజీవే అంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.