డబల్ హ్యాట్రిక్ అందుకున్న నాని ఇప్పుడు మరో విజయాన్ని అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నాని యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో “కృష్ణార్జున యుద్ధం” సినిమా చేస్తున్నారు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఇందులో ఒక సామాన్య యువకుడిగా, ప్రముఖ సింగర్ గా నాని కనిపించబోతున్నారు. ఈ పాత్రల పక్కన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
తమిళ సంగీత దర్శకుడు హిప్ హప్ తమీజా ధృవ మూవీ తర్వాత ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయిన పాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. పూర్తి పాటలను మార్చి 31న తిరుపతిలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ ఆడియో రైట్స్ కోసం చాలా మంది పోటీ పడినట్లు తెలిసింది. లహరి సంస్థ అత్యధికంగా 40 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. నాని సినిమా ఆడియో రైట్స్ ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. ఈ క్రేజ్ ని చూస్తుంటే థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధర పలికేలా ఉంది. అందరినీ ఆసక్తి కలిగిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 13 న థియేటర్లోకి రానుంది.