అడివి శేష్ ప్రధాన పాత్రలో సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన మేజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లను సాధిస్తోంది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో నిర్మాతలకు భారీ లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కావడంతో నిర్మాతలు సందీప్ పేరెంట్స్ కు రాయల్టీ ఇస్తారని అందరూ భావించారు.
అయితే మహేష్ తో పాటు ఈ సినిమాను నిర్మించిన అనురాగ్, శరత్ తాజాగా మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించి, సందీప్ తల్లీదండ్రులకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాము రాయల్టీ ఇస్తామని చెబితే తమ కొడుకు లైఫ్ ను వెలకట్టుకునే దీనస్థితిలో లేమని వాళ్లు చెప్పారని అనురాగ్, శరత్ చెప్పుకొచ్చారు. సాధారణంగా బయోపిక్ లు తీస్తే రాయల్టీ ఇవ్వడం జరుగుతుందని వాళ్లు తెలిపారు. సందీప్ పేరెంట్స్ కు కూడా రాయల్టీ ఇస్తామని చెబితే గెటౌట్ ఫ్రమ్ మై హౌస్ అంటూ సందీప్ తండ్రి తమపై ఫైర్ అయ్యాడని తెలిపారు.
సందీప్ తల్లీదండ్రులు నిజాయితీ ఉన్న మనుషులు అని నిర్మాతలు తెలిపారు. సందీప్ చనిపోయిన తర్వాత అతని ఎల్‌ఐసీ డబ్బులను కూడా వాళ్లు సన్నిహితులకు పంచారే తప్ప సొంత ఖర్చులకు వాదుకోలేదని నిర్మాతలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పౌండేషన్ ద్వారా సైన్యంలో చేరాలని భావించే యువతకు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు తెలిపారు.
సందీప్ తల్లీదండ్రులకు మేము ఇచ్చే రాయల్టీ ఇదేనని వాళ్లు అన్నారు. విక్రమ్ సినిమా ఎఫెక్ట్ మేజర్ పై పడటం వల్ల మేజర్ ఇతర రాష్ట్రాలలో మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించడం లేదు. మేజర్ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. అడివి శేష్ కు ఈ సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.