మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలు తెరకెక్కించే డైరక్టర్ కొరటాల శివ మరోసారి అటువంటి సినిమానే రూపొందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అను నేను సినిమా చేశారు. శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై మొదట నుంచి భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఫస్ట్ ఓత్, భరత్ విజన్ లు పెంచాయి. పాటలు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ఆ క్రేజ్ కారణంగా ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడ భారీ స్థాయిలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు వందకోట్ల బిజినెస్ చేసింది. ఏరియాల వారీగా బిజినెస్ వివరాలు..
ఏరియా .. పలికిన ధర (కోట్లలో ) నైజాం : 22 సీడెడ్ : 12 ఉత్తరాంధ్ర : 8.7 తూర్పు గోదావరి : 6.70 పశ్చిమగోదావరి : 6 కృష్ణ, గుంటూరు : 13.6 నెల్లూరు : 3 ఆంధ్ర, తెలంగాణలో మొత్తం : 72 ఇతర రాష్ట్రాల్లో : 9 ఓవర్సీస్ : 18 ప్రపంచవ్యాప్తంగా : 99
ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 20 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. భారీ ఓపెనింగ్స్ రాబట్టుకోనుంది.