ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు జోడీగా రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు. అయితే పూజా హెగ్డే తన కల ఇప్పటికి నెరవేరిందని చెబుతున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న పూజా హెగ్డే కొన్నేళ్ల క్రితం నుంచి పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకోవాలని కలలు కంటున్నారు.
కొన్నేళ్ల క్రితం హృతిక్ రోషన్ తో కలిసి మొహంజోదారో సినిమాలో నటించిన పూజా హెగ్డే ఆ సినిమా తన పాన్ ఇండియా మూవీ అనుకున్నానని కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత తాను నటించిన కొన్ని సినిమాలు సక్సెస్ సాధించడంతో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల సినిమాల్లో నటిస్తున్నానని పాన్ ఇండియా యాక్టర్ కావాలనే కల నిజమైందని ఆమె వెల్లడించారు.
మరోవైపు ప్రభాస్ మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాతో పాన్ ఇండియా మూవీతో సక్సెస్ సాధించాలనే పూజా హెగ్డే కోరిక తీరుతుందేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్ సరసన నటిస్తున్న పూజా హెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ లతో కూడా నటిస్తున్నారు. ప్రతి సినిమా ఆడుతుందనే నమ్మకంతోనే చేస్తామని ఒక దశలో సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల తనకు కూడా అవకాశాలు రాలేదని పూజా హెగ్డే తెలిపారు.