Naga Vamsi: నాగవంశీ మళ్ళీ ‘దేవర’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడా?
- May 27, 2025 / 02:35 PM ISTByFilmy Focus Desk
‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ తెలివితేటలే వేరు. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలతోనే స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన నాగవంశీ (Suryadevara Naga Vamsi).. తన బాబాయ్ ఎస్.రాధాకృష్ణ(చినబాబు) (S. Radha Krishna) ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్లో రూపొందే సినిమాల వ్యవహారాలు కూడా చక్కబెడుతూ ఉంటారు. దానికి కూడా షో రన్నర్ నాగవంశీనే అనడంలో సందేహం లేదు. నాగవంశీ ప్రమోషన్స్ లో చేసే హడావిడి ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. రిలీజ్ డేట్లు బ్లాక్ చేసుకోవడంలో కూడా నాగవంశీ స్ట్రాటజీలు బాగుంటాయి.
Naga Vamsi

ముందుగా వస్తున్నాయా లేదా? అనే డౌట్ ఉన్న సినిమాల కోసం తన సినిమాలను పలానా డేట్ కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి ఆ డేట్ ని లాక్ చేస్తూ ఉంటారు నాగవంశీ. గతంలో చూసుకుంటే.. సెప్టెంబర్ 27 డేట్ ను ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) రిలీజ్ డేట్ గా ప్రకటించారు. కానీ ఆ సినిమా అప్పటికి రెడీ అవ్వలేదు. నాగవంశీ ఆ డేట్ ని లాక్ చేసింది ‘దేవర’ (Devara) కోసం. ఎన్టీఆర్ (Jr NTR) – కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో తెరకెక్కిన ఆ సినిమాకి నాగవంశీ డిస్ట్రిబ్యూటర్.

ఆ తర్వాత చూసుకుంటే ఈ ఏడాది మార్చి 28ని ‘కింగ్డమ్’ (Kingdom) కోసం లాక్ చేసినట్లు ప్రకటించారు. ఆ సినిమా అప్పటికి రెడీ అవ్వలేదు. కానీ అదే డేట్ కి ‘మ్యాడ్ స్క్వేర్’ ని (Mad Square) దింపారు. ఇప్పుడు కూడా 2026 సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించడం జరిగింది. అయితే ఆ డేట్ కి సినిమా రెడీ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ టీంలో కనిపించడం లేదట.

ఆ రిలీజ్ డేట్ ను లాక్ చేసింది త్రివిక్రమ్ సినిమా కోసం అని ఇన్సైడ్ టాక్. అవును వెంకటేష్ (Venkatesh) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది అని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. రాంచరణ్ (Ram Charan) ఇందులో ఓ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి. కానీ పోటీగా చిరంజీవి (Chiranjeevi) సినిమా కూడా ఉంది కాబట్టి.. చరణ్ ఈ సినిమాలో నటిస్తాడని చెప్పలేం. ఆ డౌట్లు ఉన్నాయి కాబట్టే.. జనవరి 14 ని ‘అనగనగా ఒక రాజు’ సినిమా రిలీజ్ డేట్ అని చెప్పి నాగవంశీ హోల్డ్ చేస్తున్నట్టు సమాచారం.

















