ప్రస్తుత జనరేషన్ హీరోలకు కానీ నటులకు గానీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగితే.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల పేర్లు చెప్తుంటారు కానీ.. 90లలో పుట్టినవాళ్ళలో 98% శాతం మందికి సినిమాల మీద, ఇండస్ట్రీ మీద వ్యామోహం పెరగడానికి కారణం మాత్రం చిరంజీవి మాత్రమే కారణం. అందుకే ఆ జనరేషన్ లో ఇండస్ట్రీకి వచ్చినవాళ్ళందరూ.. మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే చిరంజీవి అని చెప్తారు. అందుకు నాగార్జున మాత్రం మినహాయింపు ఎందుకు అవుతాడు. తన తండ్రి తర్వాత తనను బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి చిరంజీవి అని నిస్సంకోచంగా చెప్పాడు నాగార్జున.
మన్మధుడు 2 ప్రమోషన్స్ లో భాగంగా.. “ఏఎన్నార్ కాకుండా మీ ఇన్స్పిరేషన్ ఎవరు?” అని ఓ అభిమాని ప్రశ్నించగా.. చిరంజీవి అంటూ నాగ్ వెంటనే సమాధానం ఇచ్చాడు. చిరంజీవి ఎందుకు తనకు ఆదర్శమో కూడా నాగ్ వివరించాడు. ఎన్టీఆర్, ఎన్నార్ ఇద్దరూ పురాణగాధల్లో అద్భుతమైన పాత్రలు చేశారు. వారిద్దరూ సీనియర్స్. కానీ చిరంజీవి, నేను ఒకే జనరేషన్ కు చెందిన వాళ్ళం. కాబట్టి చిరంజీవి గురించి నాకు బాగా తెలుసు. చాలా అట్టడుగు స్థాయి నుంచి ఎదిగారు. ప్రతి సందర్భంలో ఏదో సాధించాలి అనే తపనని చిరంజీవిలో గమనించాను అని చెప్పుకొచ్చాడు నాగార్జున. దటీజ్ మెగాస్టార్.