నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) తర్వాత వచ్చిన చిత్రం ‘సరిపోదా శనివారం'(Saripodhaa Sanivaaram). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ సినిమాని తెగ పొగిడేస్తున్నారు కొంతమంది. అయితే ఇంకొంతమంది మాత్రం ఇందులో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నారు. సెకండాఫ్ లో నిడివి ఎక్కువైంది, సాగదీత కూడా ఎక్కువైంది అనేది కొందరి వాదన.
Nani
ఇంకొంతమంది అయితే ఈ సినిమాలో ఎస్.జె.సూర్య (SJ Suryah) పాత్రే హైలెట్ అయ్యింది. హీరోకంటే ఇతని పాత్రకే రన్ టైం ఎక్కువ ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి అది నిజమే..! కానీ ఇలాంటి విషయాలను హీరోల ముందు ప్రస్తావిస్తే, వాళ్ళు పాజిటివ్ గా స్పందించడానికి ఇష్టపడరు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం దానిని పాజిటివ్ గా తీసుకున్నాడు. ‘ప్రతిసారి సినిమాలో నేనే హైలెట్ అవ్వాలి అని నాకు ఉండదు.
వాస్తవానికి హీరోకంటే మిగిలిన నటీనటుల పాత్రలకి మంచి పేరు వచ్చినప్పుడే సినిమా బాగా వచ్చినట్టు. ఆ విషయంలో నేను హ్యాపీగా ఫీలవుతున్నాను. షూటింగ్ టైంలో కూడా వివేక్(దర్శకుడు) తో నేను ఈ విషయంపై చెప్పాను. ఎస్.జె.సూర్య గారి పాత్ర లేకపోతే ఈ సినిమా లేదు అని’ అంటూ నాని చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి ప్రమోషన్స్ టైంలో నాని ఈ విషయంపై నేరుగానే స్పందించాడు. ‘సరిపోదా శనివారం’ సినిమాలో ఎక్కువ పెర్ఫార్మన్స్ చేసేది ఎస్.జె.సూర్య, మురళీ శర్మ (Murali Sharma )..లే అని..! పెర్ఫార్మన్స్ భారం అంతా వాళ్ళు తీసుకోవడం వల్లే నేను కంఫర్ట్ గా నటించేశానని నాని చెప్పుకొచ్చాడు.