సీనియర్ నటుడు నరేష్ .. సీనియర్ నటి పవిత్రతో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమెను పెళ్లి చేసుకోవడానికి కూడా నరేష్ రెడీ అయ్యాడు. కాకపోతే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. వీరి వివాహానికి అంగీకరించలేదు. అంతేకాకుండా.. నరేష్ కు విడాకులు ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఆమెకు నరేష్ తో కలిసుండాలనే ఆలోచన ఉందో.. లేదో తర్వాతి సంగతి. ఆమెకు మాత్రం పవిత్రని నరేష్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.
అందుకోసం ఆమె మీడియా ముందుకు వచ్చి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పెళ్లి చేసుకునే ఛాన్స్ లేకపోయినా.. నరేష్ – పవిత్ర.. భార్యాభర్తల్లానే కలిసుంటున్నారు.. హ్యాపీగా చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా రూపొందింది. టీజర్, ట్రైలర్ ప్రోమోలు ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని కలిగించాయి.ఎందుకంటే ఈ సినిమా నరేష్ – పవిత్ర- రమ్య రఘుపతి జీవితాలను ఆధారం చేసుకుని తీసింది అనే డౌట్ అందరిలో ఏర్పడింది కాబట్టి..!
టీజర్, ట్రైలర్ లో రమ్య రఘుపతికి సంబంధించిన సన్నివేశాలు కనిపించాయి. ముఖ్యంగా నరేష్ – పవిత్ర మైసూర్ లోని ఓ హోటల్ లో ఉండగా.. రమ్య రఘుపతి మీడియాని వెంటేసుకుని వెళ్లి రచ్చ చేసిన విజువల్స్ కూడా టీజర్, ట్రైలర్ లలో కనిపించాయి. సో ఇది రమ్య రఘుపతికి వ్యతిరేకంగా తీసిన సినిమా అనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. ఎందుకంటే ఈ చిత్రానికి నిర్మాత కూడా నరేష్ కాబట్టి.
తన మూడో భార్య పై సెటైరికల్ గా, రివేంజ్ కోసం అతను ఈ చిత్రాన్ని (Malli Pelli) రూపొందించినట్టు కూడా అంతా అనుకుంటున్నారు. మే 26 న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు రమ్య రఘుపతి ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం విడుదలను ఆపేయాలంటూ హైకోర్టులో కేసు వేసింది. విడుదలకు కొన్ని గంటలు ఉండగా రమ్య రఘుపతి ఇలా చేయడం గమనార్హం.