Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’
- January 29, 2026 / 11:33 PM ISTByPhani Kumar
శర్వానంద్ హీరోగా సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari). ‘ఏకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు ఈ సినిమాకి దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.
Nari Nari Naduma Murari Collections
కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో జనవరి 14 సాయంత్రం నుండే ప్రీమియర్ షోలు వేశారు. వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.రెండో రోజు నుండీ మరింత స్ట్రాంగ్ గా నిలదొక్కుకుంది.

మొదటి వారం చాలా బాగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా.. రెండో వారంలో కూడా బాగా కలెక్ట్ చేస్తుంది.కానీ థియేటర్లు తక్కువగా ఉండటం అనేది ఒక డిజప్పాయింట్మెంట్.ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 4.67 cr |
| సీడెడ్ | 1.17 cr |
| ఆంధ్ర(టోటల్) | 6.26 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 12.1 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.95 cr |
| ఓవర్సీస్ | 3.10 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 16.15 కోట్లు |
‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. మొత్తంగా ఈ సినిమా రూ.12.5 కోట్ల షేర్ ను రాబడితే చాలు బ్రేక్ సాధించి క్లీన్ హిట్..గా నిలిచినట్టే. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. 2 వారాలు పూర్తయ్యేసరికి రూ.16.15 కోట్ల షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా రూ.32.31 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ సినిమా ఇప్పటివరకు రూ.3.65 కోట్ల లాభాలు అందించింది.
‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!













