కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఎంత అందంగా ఉన్నా కూడా అంత ఈజీగా అయితే అవకాశాలు అందుకోలేరు. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ అందంతో పాటు కాస్త లక్కు కూడా ఉండాలని చాలా మంది చెబుతుంటారు. ఇక మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్న చిరుత పిల్ల స్నేహ శర్మ వర్గం ఓ జనాలను బాగానే ఆకట్టుకుంది. అయితే ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గానీ ఆ తర్వాత ఎక్కువగా పెద్ద సినిమాలో ఛాన్స్ అందుకోలేకపోయింది.
వరుణ్ సందేశ్ కుర్రాడు సినిమా తర్వాత నేహా శర్మ ఎక్కువగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించలేదు మధ్యలో బాలీవుడ్ లో కొన్ని ప్రయత్నాలు చేసింది కానీ అవి కూడా ఈ బ్యూటీకి పెద్దగా కలిసి రాలేదు. అయితే సినిమా అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా గ్లామర్ ప్రజెంటేషన్ లో ఈ బ్యూటీ అస్సలు తగ్గడం లేదు. తన సోషల్ మీడియా ఖాతాలలో రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోస్ ను షేర్ చేసుకుంటూ కుర్రాళ్ళను గట్టిగానే ఎట్రాక్ట్ చేస్తోంది.
ఇక చాలా రోజుల తర్వాత నేహా శర్మ గ్లామర్ లుక్ దర్శనమిచ్చింది. ఇటీవల జిమ్ వద్దా బ్లాక్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులు ఇస్తూ కనిపించింది. మూడు పదుల వయసులో కూడా నేహా పదహారేళ్ల పడుచు పిల్లలానే ఎట్రాక్ట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ గ్లామర్ తో అమ్మడు ఏవైనా అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒక సినిమా చేస్తోంది.