రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఆర్‌ఆర్‌ఆర్ ను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదని మేకర్స్ భావిస్తున్నారు. 2018 సంవత్సరం నవంబర్ 18వ తేదీన ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ మొదలు కాగా ఈ సినిమా షూటింగ్ మొదలై నిన్నటికి మూడేళ్లు పూర్తైంది. ఆర్‌ఆర్‌ఆర్ ఆలస్యం కావడంపై ఒక నెటిజన్ వ్యంగ్యంగా తాను డిప్లొమోలో ఉన్న సమయంలో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ మొదలైందని
ఇప్పుడు బీటెక్ అయిపోయినా సినిమా మాత్రం రిలీజ్ కాలేదని పేర్కొన్నారు. నెటిజన్ చేసిన కామెంట్ ఆర్‌ఆర్‌ఆర్ టీం దృష్టికి రావడంతో ఆర్‌ఆర్‌ఆర్ టీం స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “ఏం చేద్దాం మరి.. నువ్వు కాలేజ్ కు వెళ్లనన్ని రోజులు మేము షూటింగ్ కూడా చేయలేదు” అంటూ ఫన్నీగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా రాజమౌళి ఒక్కో సినిమాను పూర్తి చేయడానికి కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటారు.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల, ఇతర కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమైంది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన విడుదల కానున్న ఆర్‌ఆర్‌ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. డీవీవీ దానయ్యకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ద్వారా భారీస్థాయిలో లాభాలు వచ్చాయని తెలుస్తోంది. జక్కన్న ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారని బోగట్టా.
Diploma Lo Unnappudu Start Chesaru, Btech Kuda Aipothundhi, Movie Inka Release Kaledhu 🙂