నిహారిక తనకు చెల్లెలు లాంటిదని చెప్పిన సాయి ధరమ్ తేజ్
- May 9, 2017 / 06:19 AM ISTByFilmy Focus
ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా నిరూపించుకున్న నాగబాబు కుమార్తె నిహారిక, వరుస విజయాలతో సుప్రీం హీరో అనిపించుకున్న సాయి ధరమ్ తేజ్‌కు త్వరలో వివాహం జరగనున్నట్లు నిన్న సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్త సాయి ధరమ్ తేజ్ వద్దకు చేరడంతో ఆయన మీడియాపై మండిపడ్డారు. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. నిహారిక, తాను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని, ఆమె వరుసకు మరదలు అయినప్పటికీ సోదరి తో సమానమని స్పష్టం చేశారు.
ఇలాంటి వార్తలు వల్ల ఆ కుటుంబం ఎంత బాధపడుతోందో కొంచెం ఆలోచించమని విన్నవించారు. ఇంతటితో ఈ పెళ్లి రూమర్లు ఆగిపోతాయని భావిస్తున్నట్లు చెప్పారు. గతంలోనూ సాయి ధరమ్ తేజ్, రెజీనాకు, నిహారిక, నాగ సూర్య కు మధ్య ప్రేమ నడుస్తుందని పుకార్లు రావడంతో .. వారే స్వయంగా మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా తేజు వెంటనే స్పందించి మంచి పనిచేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















