ప్రభాస్ (Prabhas) – హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే పేరు పరిశీలనలో ఉంది. దీనిని వర్కింగ్ టైటిల్‌గా చూస్తున్నారు అని కూడా అంటున్నారు. కథ ప్రకారం ఆ పేరే బాగుంటుంది అదే ఫైనల్ చేయొచ్చు అనే చర్చ కూడా సాగుతోంది. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా ఉందని, త్వరలో ఆమె పేరు అనౌన్స్ చేస్తారు అని చాలా రోజులుగా చెబుతున్నారు. ఇప్పుడు ఫైనల్ అయిందని టాక్.
ఆ హీరోయిన్ ప్రభాస్ ఫ్యాన్స్‌కి బాగా పరిచయమే. ఇంకా చెప్పాలంటే ఆమె పాత్రను తక్కువ సేపు చూపించారు. ఇంకాస్త ఉండి, ప్రభాస్‌కి, ఆమెకు మధ్య ఇంకొన్ని సీన్స్ ఉండి, ఇంకాస్త అందం చిలికించి ఉంటే బాగుండేది అని మొన్నీమధ్య వరకు అనుకున్నారు. ఆమెనే దిశా పటానీ. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాలో రాక్సీ అనే పాత్రలో ప్రభాస్ ప్రియురాలిగా కనిపించింది. అయితే కొన్ని సీన్స్, ఒక పాటకే పరిమితమైపోయింది. ఇప్పుడు ఆమెనే ‘ఫౌజీ’లోకి తీసుకుంటున్నారట.
అయితే ఇప్పుడు ఈ సినిమాలో కూడా దిశా పటానీ (Disha Patani) పాత్ర నిడివి తక్కువగానే ఉంటుందట. అయితే మరీ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలా అంత తక్కువ అయితే కాదు అని అంటున్నారు. దీంతో దిశా పటానీ దాదాపు ఫిక్స్ అని చెప్పొచ్చు. ఇక మరో విషయం ఏంటంటే.. ‘కల్కి 2’లో దిశా పటానీ పాత్ర కొనసాగుతుంది. అందులో ఆమె పాత్రకు డైలాగ్‌లు, సన్నివేశాలు బాగానే ఉంటాయి అని చెబుతున్నారు. ఆ లెక్కన ఆ సినిమా ప్రభాస్– దిశకి హ్యాట్రిక్ అవుతుంది అని చెప్పాలి.
ఇక ‘ఫౌజీ’ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రభాస్ లైనప్‌లో ప్రస్తుతం ఉన్న అన్ని సినిమాల కంటే ముందే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ మేరకు ప్లానింగ్‌తో షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నారట. దీంతోపాటు ప్రభాస్ కూడా ఈ సినిమాకే డేట్స్ వరుసగా ఇస్తున్నారు.