జూనియర్ ఎన్టీఆర్ – విజయ్ సేతుపతి కాంబినేషన్ సెట్ కాబోతున్నట్లు మరోసారి అనేక రకాల కథనాలు వైరల్ గా మారాయి. ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. అయితే అందులో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని అనుకున్నట్లు టాక్ గట్టిగానే వచ్చింది. అయితే సడన్ గా ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో కాంబో సెట్టవ్వలేదు. ఇక ఈసారి మరొక దర్శకుడు ఈ ఇద్దరిని పవర్ఫుల్ గా చూపించబోతున్నట్లు టాక్ వేస్తోంది.
ఆ దర్శకుడు మరెవరో కాదు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం సలార్ సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న ప్రశాంత్ ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తేనున్నాడు. అయితే ఆ సినిమాలో మరొక పాత్ర కోసం విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉందట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఒక న్యూస్ మాత్రం వైరల్ గా మారింది. ఆ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్ర కోసమే కాకుండా విలన్ రోల్ కోసం కూడా బడా స్టార్స్ ను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారట.
అయితే విజయ్ సేతుపతిని ఏ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఇంకా తెలియరాలేదు. అసలు నిజంగా ఆ టాలెంటెడ్ యాక్టర్ సినిమాలో ఉంటే మాత్రం సినిమాపై అంచనాలు డోస్ మామూలుగా ఉండదు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని చెప్పవచ్చు.