సందీప్ కిషన్ (Sundeep Kishan) టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్. అండర్ రేటెడ్ హీరో. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తుంటాడు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి నోటెడ్ యాక్టర్. ధనుష్ (Dhanush) వంటి హీరోలు తమ సినిమాల్లో మంచి మంచి పాత్రల కోసం సందీప్ కిషన్ ను ఎంపిక చేసుకునే స్థాయికి ఎదిగాడు. బాక్సాఫీస్ వద్ద సందీప్ కిషన్ సినిమాలు కూడా బాగానే పెర్ఫార్మ్ చేస్తాయి. కానీ బ్రేక్ ఈవెన్ వరకు వెళ్లవు. అక్కడే వచ్చింది సమస్య అంతా..!
అందుకే సందీప్ కిషన్ మార్కెట్ పెరగడం లేదు. అయితే గత ఏడాది వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) నెగిటివ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. దీంతో సందీప్ కిషన్ తన మార్కెట్ పెంచుకోవడానికి ఇదే మంచి సమయం అని భావిస్తున్నాడు. అందుకే ‘ధమాకా’ (Dhamaka) తో ఫామ్లో ఉన్న దర్శకుడు త్రినాథరావు నక్కినతో (Trinadha Rao) ‘మజాకా’ (Mazaka) అనే సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరి 26న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఓ భాగంగా సందీప్ ఓ షాక్ ఇచ్చాడు.
అదేంటంటే.. ‘ఊరు పేరు భైరవకోన’ కి సీక్వెల్ కూడా ఉండబోతోందట. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయిందట. అది బాగా వచ్చింది అంటున్నారు. విఐ ఆనంద్ (Vi Anand) ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించబోతున్నారు అని చెబుతున్నారు. నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాకి సీక్వెల్ కూడా చేస్తుండటం కొత్త విషయమే. మరి ఈ సీక్వెల్ బెటర్ గా ఆడుతుందేమో చూడాలి.