కష్టం, సమస్య వచ్చినప్పటి తీర్చకపోయినా ఫర్వాలేదు.. ఆ కష్టానికి, సమస్యకు ఎదురెళ్తున్నవాడికి సాయం చేయాలి. అది మాట సాయం అయినా ఫర్వాలేదు అని అంటారు. దీనికి టాలీవుడ్‌లో పాటిస్తున్నారా? పాటించారా? అంటే లేదనే చెప్పాలి. దీనికి నిలువెత్తు నిదర్శనం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎదుర్కొన్న కష్టాలు, ఆ సమయంలో టాలీవుడ్ పెద్దలు ప్రవర్తించిన తీరు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఇటీవల సన్నగా చురకలు అంటించారు. పనిలో పనిగా ప్రేక్షకులకూ ఓ పంచ్ పడింది.
Pawan Kalyan
రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా నటించి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. జనవరి 10న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కడియం వేమగిరి లేఅవుట్‌లో నిర్వహించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కొంతమంది చురకలు పెట్టేలా ఉన్నాయి. అయితే ఎవరికి వారు ఆ కామెంట్స్ నా కోసం కాదు అని వదిలించుకుంటే ఏం చేయలేం.
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పవన్ కల్యాణ్‌ను చాలా ఇబ్బంది పెట్టాయి. రాజకీయ పరంగా కాకుండా వృత్తిపరంగా ఆయనను టార్గెట్ చేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు పవన్ సినిమాలపై అప్రకటిత నిషేధం విధించారు. పెద్ద సినిమా కాబట్టి టికెట్ రేట్లు పెంచాల్సింది పోగా.. ధరలు తగ్గించి ఇబ్బంది పెట్టారు. దీంతో నిర్మాతకు రావాల్సిన డబ్బులు కంటే ఇంకా తక్కువ వచ్చాయి అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని పవన్ ప్రస్తావిస్తూ తన సినిమా సమయంలో ఇబ్బంది పెట్టినా హీరోలు చాలామంది స్పందించలేదు.
అయినా మేం పట్టించుకోం అని చురక అంటించారు. ఇక అల్లు అర్జున్ (Allu Arjun) – సంధ్య థియేటర్ ఘటన విషయంలో చాలామంది నోట ఉన్నా.. ఏమనుకుంటారో అని భయంతో చెప్పని మాటను పవన్ అనేశారు. హీరోల కోసం ఒకరి మీదకు ఒకరు ఎక్కడి, దూకి చూడాల్సిన అవసరం లేదు అని అన్నారు. సంధ్య థియేటర్‌లో జరిగింది ఈ తరహా తొక్కిసలాట ఘటనే అని మరచిపోవద్దు.