టాప్ హీరోల సెలబ్రిటీల కుటుంబ సభ్యుల గురించి చాలా తక్కువ విషయాలు బయటకు లీక్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు కుటుంబానికి సంబంధించిన అరుదైన ఫోటోలు బయటకు వస్తే, అవి తెగ వైరల్ అవుతాయి. ఇలాంటి ఓ ఫోటో ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చింది. ఇటీవల ఓ ఫ్యామిలీ ఈవెంట్‌లో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఫ్యామిలీ కనిపించిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నికిచ్చింది. కృష్ణంరాజు (Krishnam Raju) సతీమణి శ్యామలాదేవి, ఆమె కుమార్తెలు ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తిలతో కలిసి ఫోజ్ ఇచ్చారు.
ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు లేని లోటు వాళ్ల కుటుంబంలో ప్రభాస్ భర్తీ చేస్తున్నాడన్న భావన అందరిలో ఉంది. ప్రభాస్‌కి నిజమైన సొంత చెల్లెలు లేరు. కానీ తన పెదనాన్న కుమార్తెలను ఆయన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ప్రసీద ఇప్పటికే నిర్మాతగా కెరీర్ ప్రారంభించి నిర్మాణ సంస్థను ముందుకు తీసుకువెళ్తోంది. ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) నుంచి ఇటీవల ప్రభాస్ సినిమాలకు ఆమె నిర్మాణ భాగస్వామిగా ఉంటోంది.
ఇక ప్రదీప్తి, ప్రకీర్తి వ్యక్తిగత జీవితాల్లో సింపుల్‌గా ఉంటూ కెమెరా దూరంగా ఉండేలా చూసుకుంటారు. కానీ ఈ సారికి ఫోటోల్లో మెరిసిన ఈ ముగ్గురు ‘రెబల్ సిస్టర్స్’ అనిపించుకున్నారు. ఇక ప్రభాస్ (Prabhas) సినిమాల విషయానికి వస్తే, రాజాసాబ్ (The Rajasaab) , ఫౌజీ వంటి భారీ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.
మరోవైపు సలార్ 2 , కల్కి 2, స్పిరిట్ (Spirit) చిత్రాలతో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల కోసం ప్రభాస్ రెడీ అవుతున్నాడు. అయితే కెమెరా ముందు కనిపించని ఫ్యామిలీ మూమెంట్స్ బయటకు వస్తే, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో మరోసారి రుజువైంది. ఈ ఫోటోలు ప్రభాస్ (Prabhas) ఫ్యామిలీని మరింత హైలైట్ చేశాయి.