సాధారణంగా ఒక మాస్ సినిమా, ఒక క్లాస్ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ప్రేక్షకులు మాస్ సినిమాకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. సలార్, డంకీ బాక్సాఫీస్ పోటీలో సలార్ కే ప్రేక్షకులు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వగా అదే సమయంలో డంకీతో పోల్చి చూస్తే సలార్ మూవీ బెటర్ టాక్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే ప్రశాంత్ నీల్ ఈ విధంగా షారుఖ్ ఖాన్ ను దెబ్బ కొట్టడం ఇదే తొలిసారి కాదు.
గతంలో జీరో, కేజీఎఫ్ సినిమాలు విడుదలైన సమయంలో కేజీఎఫ్ పైచేయి సాధించింది. ఇప్పుడు డంకీ, సలార్ విడుదల కాగా సలార్ పైచేయి సాధించింది. డంకీ మూవీ సోలోగా రిలీజై ఉంటే రిజల్ట్ బెటర్ గా ఉండేది. ప్రశాంత్ నీల్ సినిమాలకు పోటీగా సినిమాలను విడుదల చేస్తే షాక్ తప్పదని మరోమారు ప్రూవ్ అయింది. కేజీఎఫ్2 సినిమాకు సైతం పోటీగా విజయ్ బీస్ట్ రిలీజ్ కాగా ఆ సినిమా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాలలో కథనం ప్రేక్షకుల ఊహలకు అందకుండా సాగుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆరు సంవత్సరాల ఆకలి ఈ సినిమాతో తీరింది. సరైన ప్రమోషన్స్ లేకుండానే సలార్ సంచలనాలు సృష్టించడం గమనార్హం. కలెక్షన్ల విషయంలో సైతం ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. సలార్ మూవీ వల్ల చాలా రోజుల తర్వాత థియేటర్లు కళకళలాడుతుండటం గమనార్హం.
సలార్ మూవీకి ప్రభాస్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకున్నారు. సలార్2 మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను త్వరగా ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాహుబలి2 సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయో సలార్2 సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. సలార్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.