అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) రెండో వారం కూడా మంచి నంబర్లు పెట్టింది. మూడో వారంలోకి ఎంటర్ అయినా.. అదీ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా థియేటర్స్ బాగానే దక్కాయి. నార్త్ లో అయితే ‘పుష్ప 2’ కి మరో 2 వారాలు తిరుగులేనట్టే అని చెప్పాలి. అక్కడ ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతుంది.తెలుగు రాష్ట్రాల్లో కొంచెం నెమ్మదించింది. ఇక్కడ కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు.
Pushpa 2 The Rule Collections
అయితే ఇక్కడ కూడా లాంగ్ రన్ కి ఛాన్స్ ఉంది కాబట్టి, బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి ‘పుష్ప 2’ 2 (Pushpa 2 The Rule) వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే:
‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.593.43 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.11.57 కోట్ల షేర్ ను రాబట్టాలి.