దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ (వర్కింగ్ టైటిల్). ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం కారణంగా కొంత విరామం తీసుకుని మళ్ళీ రెండో షెడ్యూల్ ని ప్రారంభించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రల ఫై గత కొంతకాలంగా రకరకాల ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అడివి దొంగ పాత్రలో కనిపించబోతున్నాడని… తనని పట్టుకొనే పాత్రలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని చెప్పుకొస్తున్నారు.
అయితే ఇప్పుడు అది నిజమనే తెలుస్తుండడం గమనార్హం. హైదరాబాద్ శివార్లలో.. చరణ్, ఎన్టీఆర్ ల పైన చిత్రీకరిస్తున్న సీన్స్.. కొంచెం ఇలాగే ఉన్నాయని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కాజల్, ప్రియమణి కూడా నటిస్తున్నారని … ‘యమదొంగ’ ‘మగధీర’ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని మరికొందరు చెప్పుకొచ్చారు. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. అంతే కాదు ఒక్క హీరోలు పేర్లు తప్ప రాజమౌళి ఇంకా మిగిలిన నటీనటుల వివరాల్ని ప్రకటించలేదు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీ.వి.వి.దానయ్య నిర్మిస్తుండగా… ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. ఇక ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ రేటు పలుకుతున్నాయి. ప్రముఖ జీ టీవీ ఈ చిత్ర హిందీ ,తెలుగు , తమిళ శాటిలైట్ రైట్స్ ను దాదాపు 150 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర నిర్మాత దానయ్య మాత్రం ఈ ఆఫర్ ను హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది.