తరచూ వివాదాలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో బాగా రచ్చ చేస్తున్నారు. తాగేసి అందమైన అమ్మాయిలతో డాన్స్ లు చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా తన ఫస్ట్ లవర్ ను పరిచయం చేస్తూ ఆమె ఫోటోను షేర్ చేశారు. లైఫ్ లో ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోని వర్మ తన తొలిప్రేమను పరిచయం చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు దివంగత నటి శ్రీదేవి తన క్రష్ అని చెప్పుకొచ్చిన వర్మ కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆమె పేరు పోలవరపు సత్య అని ఆమె మెడిసిన్ చేసినట్లు తెలిపాడు. వర్మ విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివిన సంగతి తెలిసిందే. అదే క్యాంపస్ లో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సత్య మెడిసిన్ చేసిందని చెప్పాడు. రెండు క్యాంపస్ లు ఒకేచోట ఉండడంతో రోజూ సత్యను చూసేవాడినని చెప్పారు.
అలా ఆమెతో ప్రేమలో పడినట్లు.. కానీ ఆమె డబ్బున్న మరోవ్యక్తితో ప్రేమలో ఉన్న కారణంగా తనను పట్టించుకునేది కాదనే భావనలో ఉండేవాడినని అన్నారు. అలా ‘రంగీలా’ మూవీ కథ పుట్టిందని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం సత్య అమెరికాలో మెటర్నిటీ డాక్టర్ గా పని చేస్తున్నట్లు వర్మ చెప్పారు. బీచ్ లో ఆమె స్విమ్ సూట్ లో ఉన్న ఫోటోలను కూడా వర్మ షేర్ చేశారు.
My land mark film SATYA and Sridevi’s name in KSHANA KSHANAM were named after @PolavarapuSatya ..Incidentally these pics are her today’s present photos she sent me from Miami Beach pic.twitter.com/yIvAS8jb9u
— Ram Gopal Varma (@RGVzoomin) August 25, 2021
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!