పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో ‘ సితార ఎంటర్టైన్మెంట్స్ ‘ బ్యానర్ పై నాగ వంశీ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ సంబాషణలు సమకూర్చడం విశేషం. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే సినిమాని సింగిల్ హీరో మూవీగా ప్రమోట్ చేయడం ఒక్కటే సాధారణ ప్రేక్షకులతో పాటు పవన్ అభిమానులకు కూడా నిరాశని కలిగిస్తున్న అంశం.
ఇదిలా ఉండగా.. నిజానికి ఒరిజనల్ వెర్షన్ లో ఇద్దరు హీరోల పేర్లను రిప్రెజంట్ చేస్తూ టైటిలే ఉంటుంది. ఇద్దరి హీరోల మధ్యన వచ్చే సన్నివేశాలు కూడా దెబ్బ దెబ్బ అన్నట్టే ఉంటాయి. ఆఖరి ఫైట్ కూడా అంతే..! అయితే తెలుగుకి వచ్చేసరికి ఫార్మెట్ మొత్తం మారిపోతుందని వినికిడి.సెట్స్ లో ఇద్దరు దర్శకులు పనిచేస్తూ ఉండడం వలన ఒకరు అటు లాగితే ఇంకొకరు ఇటు లాగుతున్నారు. ఈ క్రమంలో రానా పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఎక్కువైపోతున్నట్టు వినికిడి.
అంతేకాకుండా ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుందట. ఒరిజినల్ లో అయితే అలాంటి ఎపిసోడ్ ఉండదు. మరి ఇక్కడ ఎందుకు అలా పెడుతున్నారు.. అది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!