కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ కి తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవ్వడమే కాకుండా మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఇకపోతే ఈయన ప్రస్తుతం తెలుగులో పూర్తిస్థాయి చిత్రాలలో నటిస్తున్నారు. ఇకపోతే ధనుష్ నటించిన విఐపి సినిమా గురించి మనకు తెలిసిందే. ధనుష్ హీరోగా నటించిన వీఐపీ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలయి మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇకపోతే ఈ సినిమాకి ధనుష్, ఐశ్వర్య నిర్మాతలుగా వ్యవహరించారు.ఇక ఈ సినిమాలో ప్రోగతాగే సన్నివేశాలు అధికంగా ఉండటమే కాకుండా ప్రభుత్వ హెచ్చరికలను పొందపరచలేదంటూ ఈ సినిమాపై టొబాకో నియంత్రణ కమిటీ 2014లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విధంగా ఈ సినిమాపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ స్థానిక సైదాపేట కోర్టులో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లపై పిటిషన్ దాఖలు చేశారు. సైదాపేట కోర్టు ఐశ్వర్య రజినీకాంత్, ధనుష్ లను కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని తెలిపారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యి కోర్టు నుంచి తెచ్చుకున్నారు. ఇకపోతే ఈ విషయంపై ధనుష్ సైతం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సోమవారం సోమవారం విచారణకు వచ్చింది. దీంతో ధనుష్ తరపు న్యాయవాది విజయన్ సుబ్రమణియన్ హాజరై ధనుష్ సైదాపేట కోర్టుకు హాజరవడంపై స్టే విధించాలని విజ్ఞప్తి చేయడంతో సైదా పేట కోర్టులో హాజరవ్వడంపై స్టే విధిస్తూ తదుపరి విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా వేశారు.