గతేడాది సెప్టెంబర్ 30వ తేదీన థియేటర్లలో విడుదలైన కాంతార మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. ఈ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కనుందని ప్రకటన వెలువడగా భారీ బడ్జెట్ తో కాంతార ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి ఎంతో కష్టపడుతున్నారని ఏకంగా 11 కేజీల బరువు తగ్గారని సమాచారం అందుతోంది.
కాంతార ప్రీక్వెల్ లో రిషబ్ శెట్టి (Rishab Shetty) పాత్ర అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే కాంతార ప్రీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తయ్యాయని సమాచారం అందుతోంది. నవంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. కాంతార ప్రీక్వెల్ కోసం రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.
నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఈ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటామని ఫీలవుతున్నారు. కాంతార ప్రీక్వెల్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంతార సినిమాను మించి కాంతార ప్రీక్వెల్ ఉండనుందని తెలుస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంతార ప్రీక్వెల్ కాంతార సినిమాను మించిన విజయాన్ని సొంతం చేసుకుని నిర్మాతలకు మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.