స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలు రిలీజైతే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. మన దేశంతో పాటు విదేశాలకు చెందిన ప్రేక్షకులు సైతం ఆర్ఆర్ఆర్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ విషయంలో ప్రీమియర్స్ తోనే సంచలనాలు సృష్టించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. యూఎస్ లోని రాఫ్తార్ క్రియేషన్స్,
సరిగమ సినిమాస్ ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ హక్కులను చేజిక్కించుకోగా త్వరలో ఓవర్సీస్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ కూడా మొదలయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. సినిమా రిలీజ్ కు కొన్ని వారాల ముందే బుకింగ్స్ ను మొదలుపెట్టి ప్రీమియర్స్ తోనే సంచలనాలు సృష్టించాలని ఆర్ఆర్ఆర్ మేకర్స్ భావిస్తున్నారని బోగట్టా. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ఓవర్సీస్ మార్కెట్ దెబ్బ తినగా ఆర్ఆర్ఆర్ భారీ కలెక్షన్లు సాధించి భవిష్యత్తులో రిలీజయ్యే పెద్ద సినిమాలకు నూతనోత్సాహాన్ని ఇస్తుందని చరణ్, ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ మేకర్స్ యూఎస్ ప్రీమియర్స్ కు త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని బ్లాస్ట్ కు సిద్ధంగా ఉండాలని చేసిన ప్రకటన ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఆర్ఆర్ఆర్ ఎప్పుడు రిలీజైనా సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆర్ఆర్ఆర్ సినిమా 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాకు పోటీగా భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.