‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ నుంచి ఆగష్టు నెలలో విడుదలైన దోస్తీ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా దోస్తీ సాంగ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ పై ప్రేక్షకులు పెంచుకున్న అంచనాలకు తగిన స్థాయిలో లేదని కామెంట్లు వినిపించాయి. మొదటి పాట అంచనాలను అందుకోకపోవడంతో ఈ సినిమా నుంచి రెండో పాటగా నాటు నాటు సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్, చరణ్ ప్రోమోలో వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
నాటు నాటు సాంగ్ ప్రోమోను చూడటానికి రెండు కళ్లు చాలడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సాంగ్ గురించి కాపీ ఆరోపణలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాహుబలి సిరీస్ లోని చాలా సీన్లను జక్కన్న హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారని కామెంట్లు వినిపించాయి. అయితే ఈ ఆరోపణల గురించి జక్కన్న గతంలో స్పందించలేదు. నాటు నాటు సాంగ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతోంది. అయితే ఆఫ్రికన్ సాంగ్ లోని స్టెప్పులే ఈ సాంగ్ లో ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
masaka kids africana dancing పేరుతో ఉండే వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ పాటలోనిస్టెప్పులను సాంగ్ లో కాపీ కొట్టారని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు యూట్యూబ్ లో ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. దాదాపుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.