నితిన్ (Nithiin) హీరోగా ‘బలగం’ (Balagam) వేణు (Venu Yeldandi) దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా రూపొందనుంది. దిల్ రాజు (Dil Raju) దీనికి నిర్మాత. ఇప్పుటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా నటీనటుల ఎంపిక జరిగింది. ముందుగా నేచురల్ స్టార్ నానికి (Nani) ఈ కథ చెప్పాడు వేణు. నానికి కథ బాగా నచ్చింది కానీ.. తన వరుస కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా చేయలేకపోయాడు. అలాగే పారితోషికం నెంబర్ దగ్గర కూడా నాని సంతృప్తి చెందలేదు అనేది ఇన్సైడ్ టాక్.
అటు తర్వాత తేజ సజ్జ (Teja Sajja) అనుకున్నారు. కానీ అతనికి కూడా ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్ట్ లేదు. ఫైనల్ గా నితిన్ ని అప్రోచ్ అవ్వడం.. అతను ఓకే చెప్పేయడం జరిగింది. అయితే హీరోయిన్ గా సాయి పల్లవిని (Sai Pallavi) అనుకున్నారు.ఇలాంటి రూటెడ్ స్టోరీస్ కి సాయి పల్లవి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. ‘విరాటపర్వం’ (Virata Parvam) ‘తండేల్’ (Thandel) వంటి సినిమాల్లో నటించడానికి ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. కాబట్టి ‘ఎల్లమ్మ’ ప్రాజెక్టుకి కూడా ఆమె ఓకే చెబుతుంది అని అంతా అనుకున్నారు.
పైగా ‘ఎల్లమ్మ’ కథ కూడా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది.అందులోనూ దిల్ రాజు బ్యానర్లో ఆమె ‘ఫిదా’ (Fidaa) ‘ఎం.సి.ఎ’ (MCA) వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఊహించని విధంగా సాయి పల్లవి ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఫుల్ బిజీగా ఉంది. కాల్షీట్లు అడ్జస్ట్ చేయలేక ఆమె తప్పుకున్నట్టు ఇన్సైడ్ టాక్.