E.I.P.L పతాకంపై వి.జే సన్నీ,,శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ సింగ్, నటీనటులు గా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో సంజీవ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “సకల గుణాభి రామ”. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకువిడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ , దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి లు ఈ చిత్రంలో ని పాటలను విడుదల చేయగా..దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో విశ్వక్ సేన్ లు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో కమెడియన్ శివారెడ్డి, బిగ్ బాస్ అల్ సీజన్స్ కాంటెస్టెంట్స్ పాల్గొని చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ..టీం అందరికీ అల్ ద బెస్ట్ తెలిపారు..అనంతరం
దర్శకుడు నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చిన ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీలో ఎన్నో మంచి సినిమాలు తీయాలి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా చాలా మంది కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకు రావాలి. వెలిగొండ శ్రీను నేను ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాను.తను మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సినిమా తీస్తాడు.మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ టైమింగ్ ఉన్న రైటర్ అండ్ డైరెక్టర్ వెలిగొండ శ్రీను.తనకు “సకలగుణాభి రామ” చిత్రం జనాలకు అద్భుతమైన మెసేజ్ ఇచ్చే సినిమా చేశారు. ఇందులో ఉన్న సాంగ్స్ విజువలైజేషన్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి.సన్నీ చాలా బాగా చేశాడు.ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని.. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ… ట్రైలర్ చాలా బాగుంది సన్నీని సపోర్ట్ చేయడానికి బిగ్ బాస్ సీజన్ లో ఉన్న అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది .సన్నీ గురించి స్పెషల్ గా చెప్పాలి..తను డౌన్ టు ఎర్త్ అంటే ఇష్టం ఎంత పైకొచ్చిన గ్రౌండెడ్ గా ఉండటం అంటేనే ఇష్టం. అది సన్నీ లో చూశాను షో లో చూసాను, బయట చూశాను అందుకే నాకు సన్నీ అంటే ఇష్టం. నా ఫస్ట్ ఫిలిం పటాస్ డైరెక్ట్ చేసేటప్పుడు నుండి వెలిగొండ తో జర్నీ చేస్తున్నాను. తను “అందగాడు” సినిమాను డైరెక్ట్ చేశాడు .ఇప్పుడు తను చేస్తున్న రెండవ వ సినిమా ఇది. రైటర్ గా బిజీగా ఉన్న తను డైరెక్టర్ గా బిజీ అయి ఎన్నో సినిమాలను తీయాలని కోరుతున్నాను. నిర్మాతలకు ఇది ఫస్ట్ పిక్చర్ అయినా వారికి ఈ సినిమా స్పెషల్ ప్రాజెక్టు.వారు ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుతున్నాను
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ.. ఎంతో కష్టపడుతూ క్రియేటివ్ గా ఆలోచించే వారు ఎప్పుడూ సక్సెస్ అవుతారు.సన్నీ బిగ్ బాస్ ద్వారా కొన్ని లక్షల మంది అభిమానులు సంపాదించుకున్నాడు.ఇందులో తను చాలా చక్కగా నటించాడు.మంచి కథతో వస్తున్న నిర్మాతలకు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..నేను కూడా నటుడు కావడానికి చాలా ఇబ్బందులు పడ్డాను.9 సినిమాలకు సెలెక్ట్ అయిన తరువాత కూడా నన్ను రిజెక్ట్ చేసే వారు.తరుణ్ భాస్కర్ అన్న నన్ను గుర్తించి నాకు హీరో అవకాశం ఇచ్చాడు.అలా నేను కూడా స్త్రగుల్ ఫేస్ చేశాను.ఇప్పుడు కూడా నీవు బిగ్ బాస్ కు వెళ్లక ముందే నిన్ను గుర్తించి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మాకంటే ఎక్కువగా ప్రతి ఒక్కతెలుగువారి ఇంట్లో నువ్వు ఉన్నావు .ఈ చిత్ర ట్రైలర్ బాగుంది.ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అంబరు.
గెస్ట్ గా వచ్చిన నిర్మాత వివేక్ మాట్లాడుతూ ..ఇక్కడకు వచ్చిన నాకు బిగ్ బాస్ ఆల్ సీజన్స్ అంతా ఇక్కడే ఉన్నట్లు కన్నులపండుగగా ఉంది.దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ కు నిర్మాతలకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు
చిత్ర దర్శకుడు వెలుగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వివి వినాయక్ గారు అడగగానే సాంగ్ లాంచ్ చేశారు, దర్శకుడు బాబీ గారు కూడా సాంగ్ లాంచ్ చేశారు. వారికి మా ధన్యవాదాలు వీరితో పాటు చాలామంది మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు వారందరికీ థాంక్స్. .మా మెగా డైరెక్టర్ అనిల్ రావిపూడి.విశ్వక్ సేన్ లు ఎంతో బిజీగా ఉన్నా కూడా మా ఫంక్షన్ కు వచ్చి మమ్మల్ని బ్లెస్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది.ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ స్టోరీ తీద్దామనుకుని నిర్మాతలకు ఈ కథ చెప్పడం జరిగింది. నిర్మాత కథ బాగుంటే చేద్దామని ముందుకు వచ్చాడు. అయితే వారితో సినిమా అంటే లాటరీ లాంటిది దాన్ని మనం కష్టపడి చేయడమే తప్ప రిజల్ట్ ఎలా వస్తుందో తెలియదు మన చేతుల్లో ఉండదు .నా వంతు నేను కష్టపడతాను అంటే చేద్దాం.. అని ముందుకు వచ్చారు. హీరోయిన్స్ చాలా చక్కగా నటించారు..డి.ఓ.పి నలిని గారు నేను అనుకున్న దాని కంటే ఎక్కువ ఔట్ ఫుట్ ఇచ్చారు. టెక్నీషియన్స్, నటీ నటులు అందరూ సహకరించడంతో సినిమా చాలా బాగా వచ్చింది.E.I.P.L బ్యానర్ లో నిర్మాతలు ఇంకో వంద మందికి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇందులోని పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటల్లాగే సినిమా కూడా చాలా బాగుంటుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను
హీరో వి.జె సన్నీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు మరియు బిగ్ బాస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. ప్రతి మనిషికి లైఫ్ లో ఎక్కువమంది ఉండాల్సింది స్నేహితులే.. వాళ్ళే నన్ను ముందు ఉండి నడిపిస్తారు.మా ఫ్రెండ్స్ కి నేను హీరో అవ్వాలని డ్రీమ్ ఉంది.అందుకే వారి డ్రీమ్ ను నెరవేర్చడానికి యాక్టర్ కావాలని చాలా ట్రై చేశాను.కానీ కుదరలేదు.నేను 10th క్లాస్ లో నటన కోసం హైదరాబాద్ కు రావాలని ట్రైన్ ఎక్కితే అది విజయవాడకు వెళ్ళింది.మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను థియేటర్ ఆర్ట్స్ కూడా చేశాను.ఆ తర్వాత నేను విజె గా చేశాను. నాకు వరుణ్ సందేశ్ సినిమా లంటే చాలా ఇష్టం తనతో “హ్యాపీ డేస్” లో రాజేష్ క్యారెక్టర్ చేయాలి కానీ అప్పుడు మిస్సయ్యాను. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చి మిస్ అయ్యాయి. హుషారులో చేయాలి కానీ చేయలేకపోయాను. నాకు ” కల్యాణ వైభోగమే” సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది.ఆ తర్వాత వెలిగొండ శ్రీనివాస్ అన్న మాత్రం వీడు యాక్టింగ్ చేయగలడని గుర్తించి ఈ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ ఇచ్చాడు .ఈరోజు నాకు గ్రేట్ మూమెంట్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక మనిషిని ట్రస్ట్ చేసి ఎంతో డబ్బు పెట్టి సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు వలిగొండ శ్రీనివాస్ అన్న చెప్పిన కథను, నన్ను నమ్మిన నిర్మాతలు ఒక్క రోజు కూడా ఆలోచించకుండా చేద్దామని ముందుకు వచ్చారు.వారికి నా ధన్యవాదాలు..ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి పిలుపు రావడం జరిగింది.బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది నన్ను అక్కున చేర్చుకొని నా విజయానికి కారకులయ్యారు వారికి నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను. ఈ సినిమాకు రేయి పగలు అనే తేడా లేకుండా కంటిన్యూగా ఇరవై నాలుగు గంటలు వర్క్ చేసిన సినిమా ఇది. అనుదీప్ నాలుగు మంచి సాంగ్స్ ఇచ్చాడు. అమిత్ త్రివేది గారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మాకోసం “సైకో పిల్లా” సాంగ్ పాడాడు..ఒక మనిషి ఎంత ఎత్తుకెళ్లినా కూడా తోటివారికి అండగా నిలబడతాడు అలాంటి వ్యక్తే దర్శకుడు అనిల్ రావిపూడి గారు ,విశ్వక్ సేన్ వారు మమ్మల్ని బ్లెస్స్ చేయఫానికి ఈ ఈవెంట్ కు వచ్చినందుకు ధన్యవాదాలు.ఎంతో మంది పెద్దలు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ శ్రేయోభిలాషి లతో ఈ స్టేజి మీద షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది..ఇక నుండి మంచి మంచి సినిమాలు చేస్తా మీ అందరికీ పేరు వచ్చేలా ఉంటాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ మా సినిమాను ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ..ముందుగా సంగీత దర్శకుడు ఆర్ పి గారికి ధన్యవాదాలు జరుపుకోవాలి. ఈరోజు నేను ఒక సినిమాకు సంగీత దర్శకుడుని అయ్యానంటే దానికి ఆర్ పి గారే కారణం.నేను చాలా మంది దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాను వారందరికీ నా ధన్యవాదాలు. సంగీత దర్శకుడు గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్య వాదాలు. సింగర్లు ,టెక్నిసిషన్స్ , అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు
హీరోయిన్ ఆషిమా,తరుణి మాట్లాడుతూ..సన్నీ తో వర్క్ చేయడం మనకు గొప్ప ఎక్స్పీరియన్స్. అనుదీప్ అద్భుతమైన సంగీతం అందించారు.మాకిలాంటి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు .
ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు వరుణ్ సందేశ్, లిరిసిస్ట్ రఘురాం ,లిరిక్ రైటర్ సింహాచలం, శ్రీ తేజ్, మానస్, తదితర బిగ్ బాస్ టీం చిత్ర హీరో సన్నీకి, దర్శక, నిర్మాతలకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!