ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. బెంగళూరులో సలార్ మూవీ అన్ బీటబుల్ రికార్డ్ ను ఖాతాలో వేసుకుంది. కేవలం 10 నిమిషాల్లోనే బెంగళూరు సిటీలో ఈ సినిమాకు సంబంధించి 10,000 టికెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ మూవీ టికెట్ యాప్స్ లో ఇప్పటికే సలార్ సంచలనాలు మొదలయ్యాయని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతుండటం గమనార్హం. సలార్ రికార్డుల విషయంలో ఇది ఆరంభం మాత్రమేనని తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలైతే మామూలుగా ఉండదని ఫ్యాన్స్ చెబుతున్నారు.
బుక్ మై షో వెబ్ సైట్ లో ఈ సినిమాకు ఏకంగా 1.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఉదయం 5 గంటల నుంచి బెంగళూరులో ఈ సినిమా ప్రదర్శితం కానుండగా మార్నింగ్ షోలకు ఇప్పటికే హౌస్ ఫుల్స్ పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో సలార్ మూవీ ఫస్ట్ డే టికెట్లు దొరకడం సులువు కాదని తెలుస్తోంది.21వ తేదీ అర్ధరాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సలార్ ప్రదర్శితం కానుంది.
టికెట్ రేట్ల పెంపు వల్ల ఈ సినిమాల బుకింగ్స్ ఒకింత ఆలస్యం కానుందని సమాచారం అందుతోంది. సలార్ ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. సలార్1 సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయని ఈ సినిమా కోసం కండలు పెంచానని ప్రభాస్ వెల్లడించారు. ఈ సినిమా వల్ల ప్రశాంత్ నీల్ తో స్నేహం బలపడిందని ప్రభాస్ పేర్కొన్నారు.
సలార్ (Salaar) మూవీ ఫస్ట్ టికెట్ 10116 రూపాయలు పలికిందని ప్రచారం జరుగుతోంది. రాజమౌళి ఈ టికెట్ ను ఇంత మొత్తం చెల్లించి కొనుగోలు చేశారని టాక్ వినిపిస్తోంది. సలార్ కోసం పెద్దగా కష్టపడలేదంటూ ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటున్న ప్రభాస్ సలార్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.