ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ ఏ రేంజ్ లో ప్రభంజనం, సంచలనాలు సృష్టించనుందో ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 175 కోట్ల రూపాయలుగా ఉండనున్నాయని ఈ రేంజ్ లో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లను సాధించిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎ సర్టిఫికెట్ వచ్చినా సలార్ సంచలనాలు కొనసాగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే సలార్ మూవీ వీక్ డేస్ లో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సంక్రాంతి సినిమాలకు సలార్ షాకివ్వనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి సినిమాలకు సలార్ రేంజ్ టాక్ రావాలని అలా రాకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే వారం థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలపై కూడా సలార్ ఎఫెక్ట్ కొంతమేర ఉండే ఛాన్స్ అయితే ఉంది.
మరోవైపు ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా శాటిలైట్ హక్కులు స్టార్ మా సొంతమయ్యాయి. ఎనిమిది వారాల తర్వాత సలార్ ఓటీటీలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అద్భుతంగా ఉండగా కథను నడిపించిన తీరు ఆకట్టుకుంది. సలార్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నాయి.
ఇకపై ప్రభాస్ వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్ సక్సెస్ తో ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి. 2023 బిగ్గెస్ట్ హిట్ సలార్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. (Salaar) సలార్ లో ప్రభాస్ లుక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.