Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ పిలుపు!

‘కభీ ఈద్ కభీ దివాలి’ సినిమా షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చారు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. ఈ క్రమంలో టాలీవుడ్ కి చెందిన చాలా మంది సెలబ్రిటీలను కలుస్తున్నారు. ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0లో భాగంగా మొక్కలు నాటారు సల్మాన్. ఆ తరువాత ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటాలని..

ఆ తరువాత పని అయిపోయిందని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో చాలా మంది చనిపోతున్నారని.. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని చెప్పారు. ఇలాంటి ఓ పనికి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ద్వారా బాటలు వేశారని.. దాన్ని మనం కొనసాగిస్తే భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని అన్నారు.

తన అభిమానులంతా తప్పకుండా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు, జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనమని అడిగిన వెంటనే సల్మాన్ ఒప్పుకున్నారని.. దానికి ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. సల్మాన్ లాంటి వాళ్లు మొక్కలు నాటడం వలన కోట్ల మంది అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.