సమంత పరిచయం అవసరం లేని పేరు ప్రస్తుతం ఈమె తన సినిమాలను ఎంతో విభిన్నంగా ఉండేలా ఎంపిక చేసుకొని విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో సమంత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె యశోద సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే ఈ సినిమా నుంచి టీజర్ నేడు విడుదల కానుంది.
అయితే త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.ఇకపోతే లేడి ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సమంత కేవలం 50 రోజులకు కాల్షీట్స్ మాత్రమే ఇచ్చినట్టు సమాచారం. ఇలా అది తక్కువ కాల్ షీట్స్ కోసం ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ మాత్రం భారీగా ఉందని తెలుస్తోంది. సమంత యశోద సినిమా కోసం ఏకంగా 2.75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం.
సమంత ఈ సినిమాకి ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.అయితే సమంత ఇది వరకే పలు సినిమాలకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ తన కాల్ షీట్స్ కూడా ఎక్కువగా ఉండేవి కానీ 50 రోజుల కాల్ షీట్ కోసం రెమ్యూనరేషన్ కి ఈ స్థాయిలో తీసుకోవడం అంటే నిజంగానే భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నారని చెప్పాలి. ఇక యశోద సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ఈమె శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు.అదేవిధంగా గుణశేఖర్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం శాకుంతల కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.