నారా రోహిత్ కెరీర్ ఆరంభించిన తొలి ఆరేళ్లలో ఏడు సినిమాలు విడుదలయ్యాయి. అలాంటింది ఒక్క 2016 లోనే అయిదు సినిమాలు విడుదలయూయ్యాయి. విడుదలలో ఆలస్యమై నిన్న తెరమీదికొచ్చిన ‘శంకర’ ఆరో సినిమా. ఇదే ఏడాది విడుదల కానున్న ‘అప్పట్లో ఒకడుండే వాడు’ ఎదో సినిమా కానుంది. ఒక్కసారిగా స్పీడ్ రోహిత్ పెంచడంతో అందరూ అబ్బురపోయారు. ఇదంతా ఎలా సాధ్యమని తోటి కథానాయకులు జుట్టు పీక్కున్నారు. అయితే దాని వెనక ఉన్న రహస్యాన్ని రోహిత్ బయటపెట్టాడిప్పుడు.
రోహిత్ తో సినిమాలు చేస్తున్న దర్శకులందరూ కొత్తవాళ్లే. ఒక సినిమా అనుభవం ఉన్నవాళ్లు ఒకరిద్దరు ఉంటారు. అందువల్ల డేట్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తే అవకాశం లేదు. స్క్రిప్ట్ పూర్తవడమే ఆలస్యం రెండు నెలలో షూటింగ్ పూర్తి, తర్వాత ఓ ఇరవై లేదా 30 రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది అని చెప్పుకొచ్చాడు ఈ నారా వారి హీరో. తన తర్వాతి సినిమాల గురించి చెబుతూ ‘పండగలా దిగివచ్చాడు’ ఒక్కరోజు షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉండగా హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతోన్న ‘కథలో రాజకుమారి’ జనవరిలో విడుదలవనుంది. దీంతోపాటు బీవీవీ చౌదరి దర్శకత్వంలో వీరుడు, పవన్ సాధినేనితో చేయనున్న ‘భీముడు’ రోహిత్ చేయాల్సిన సినిమాల లిస్ట్ లో ఉన్నాయి.