సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం అనే సంగతి తెలిసిందే. ఈ రంగంలో సక్సెస్ కావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. సక్సెస్ సాధించినా ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడం కూడా సులువు కాదనే సంగతి తెలిసిందే. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న షకలక శంకర్ (Shakalaka Shankar) కొన్ని సినిమాలలో హీరో రోల్స్ లో నటించారు. అయితే హీరో రోల్స్ లో నటించడం గురించి శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రెండేళ్ల పాటు నేను సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్నానని షకలక శంకర్ తెలిపారు. చిన్నచిన్న పాత్రలు ఏం ఇస్తాం అని ఇవ్వని సందర్భాలు సైతం ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు. వినాయక్ (V. V. Vinayak) డైరెక్షన్ లో అదుర్స్, బద్రీనాథ్ (Badrinath) సినిమాలలో చిన్నచిన్న రోల్స్ లో కనిపించానని షకలక శంకర్ తెలిపారు. నేను ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సమయానికి వినాయక్ ఎక్కువ సినిమాలు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.
2017, 2018లలో ఆఫర్లు రాకపోవడంతో హీరో కావాలని అనుకున్నానని షకలక శంకర్ తెలిపారు. ఆ తర్వాత వరుసగా నాలుగు సినిమాలు చేశానని ఆయన అన్నారు. నేను హీరోగా చేసిన కొన్ని సినిమాలు కళా ఖండాలు అని ఆ సినిమాలు నన్ను కుమ్మి నలిపి తోసేశాయని షకలక శంకర్ పేర్కొన్నారు. నిర్మాతలు షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ప్రొడ్యూసర్లు మారుతూ ఉంటారని వాళ్లు మార్పులు చెబుతూ ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు.
కొన్ని సినిమాలకు అడ్వాన్స్ వెనక్కు ఇచ్చి షూట్ పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయని షకలక శంకర్ తెలిపారు. 6, 7 సినిమాలకు అలాగే జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధంగా నిర్మాతలు నాతో ఆడుకున్నారని షకలక శంకర్ అన్నారు. నేను దారుణమైన కష్టాలను అనుభవించానని షకలక శంకర్ పేర్కొన్నారు. ఇప్పటికీ కొన్ని సినిమాలు రన్నింగ్ అవుతున్నాయని ఆయన తెలిపారు. ఏమి చేయకూడదో ఏమీ చేయాలో ఐదారేళ్లలో తెలుసుకున్నానని ఆయన తెలిపారు.