మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నానికి వి, టక్ జగదీష్ సినిమాల ఫలితాలతో భారీ షాకులు తగిలాయనే సంగతి తెలిసిందే. వి, టక్ జగదీష్ సినిమాల హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనా ఆ సినిమాల ఫలితాలు నిరాశపరచడంతో శ్యామ్ సింగరాయ్ సినిమాపైనే నాని ఆశలు పెట్టుకున్నారు. నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా థియేటర్లలోనే రిలీజ్ కానుంది. అయితే సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కానుందని వార్తలు వస్తున్నాయి.
నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఏకంగా 8 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి ఈ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే శ్యామ్ సింగరాయ్ డిజిటల్ రైట్స్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మినిమం గ్యారంటీ హీరోగా నానికి పేరు ఉండటంతో ఓటీటీ కంపెనీలు నానికి భారీగా ఆఫర్ ఇస్తుండటం గమనార్హం. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. సాయిపల్లవి, కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. భారీ అంచనాలతో రిలీజ్ కానున్న ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ను సాధిస్తుందో చూడాలి. అమెజాన్ ప్రైమ్ నానికి అచ్చిరాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.