శ్రీలీల (Sreeleela) చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలోని పాత్రల విషయంలో అలాంటివే ఎంచుకుంటూ వస్తోంది. బయట కూడా ఆమె లానే ఉంటుంది. ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియాల్లో ఆమెను ఇలా చూస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి తన యాక్టివ్‌నెస్ గురించి చెప్పేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే వాచ్‌మ్యాన్ చేసే ఆమె చేసిన డ్యాన్స్. మీరు కూడా ఆ వీడియో ఇప్పటికే చూసి ఉంటే ఓకే.. లేదంటే ఓ లుక్కేయండి భలే ఉంది.
Sreeleela
శ్రీలీల మంచి డాన్సర్. తెలుగు సినిమాలో స్టార్ హీరోలతో సమానంగా డాన్స్ చేయగల హీరోయిన్‌గా ఆమెకు పేరుంది. అలాంటి శ్రీలీల ఒక సామాన్య వ్యక్తితో డాన్స్ చేసింది. వాచ్‌మ్యాన్‌తో కలసి ఆమె స్టెప్పులు వేసింది. ఓ పెద్ద బిల్డింగ్ బయట సెక్యూరిటీగా ఉన్న ఓ వ్యక్తి దగ్గరకు హుషారుగా వచ్చి ఆయనతో కలసి స్టెప్పులేసింది. అయితే ఎందుకు చిందేసింది అనేది తెలియడం లేదు. ఆ వీడియోను స్వయంగా శ్రీలీలనే షేర్ చేశారు.
ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే.. నితిన్‌తో (Nithiin) ‘రాబిన్ హుడ్’ (Robinhood) అనే సినిమా చేసింది. ఈ సినిమా మార్చి 28న విడుదల చేస్తున్నారు. రవితేజ (Ravi Teja) సరసన మాస్ జాతర (Mass Jathara) అనే సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. తమిళంలో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) 25వ సినిమా ‘పరాశక్తి’లో (Parasakthi) కూడా శ్రీలీల నటిస్తోంది. ఇక అఖిల్ (Akhil Akkineni) కొత్త సినిమాలో ఈమెనే తీసుకున్నారట. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)– హరీష్ శంకర్ (Harish Shankar) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాలోనూ ఆమెనే నాయిక.
ఇవిలా ఉండగా బాలీవుడ్‌లోనూ శ్రీలీల ప్రయాణం మొదలుకాబోతోంది. ఓ బాలీవుడ్ నెపో కిడ్‌తో ఆమె తొలి సినిమా చేస్తోందని వార్తలొస్తున్నాయి. అయితే ఇంకా ఎక్కడా అధికారిక ప్రకటన అయితే రాలేదు. త్వరలోనే ఆ సినిమా అనౌన్స్‌మెంట్ వస్తుంది అని చెబుతున్నారు. ఇప్పటికే ఆ సినిమా కోసం శ్రీలీల ముంబయి తరచుగా వెళ్లోస్తోందని సమాచారం.